Ante Sundaraniki: ‘అంటే..’లో ఈ సీన్‌ ఉంటే… సూపర్‌ అసలు

కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా, మొబైల్‌లో మాట్లాడుతూ ట్రాఫిక్‌ పోలీసులకు దొరికితే.. ఏమౌతుంది. ఏముంది అన్ని రకాల కాగితాలు చూపించేంతవరకు ఆపి, చూపించాక విడిచిపెడతారు. ఈ క్రమంలో అక్కడ అంతా టెన్షన టెన్షన్‌ ఉంటుంది. కానీ ఆ ప్లేస్‌లో నాని ఉంటే, అందులోనూ తొందరెక్కువున్న సుందరం లాంటి నాని ఉంటే.. ఫుల్‌ నవ్వులే నవ్వులు. అచ్చంగా అలాంటి సీనే ‘అంటే సుందరానికి’ సినిమా కోసం తెరకెక్కించారు. అయితే కొన్ని కారణాల వల్ల డిలీట్‌ చేశారు. ఇప్పుడు ఆ సీన్‌ యూట్యూబ్‌లో వదిలారు. ఇంకేముంది ఫుల్‌ వైరల్‌ అవుతోంది.

సినిమా నిడివి పెరుగుతుందని సినిమాల్లోని కొన్ని సన్నివేశాలకు కత్తెరేస్తుంటారు. ఈ క్రమంలో చాలా బాగుండే సీన్లు కూడా మిస్‌ అవుతుంటాయి. అలా ‘అంటే.. సుందరానికీ!’ సినిమాకు సంబంధించి ఓ సీన్ తెరపైకి రాలేకపోయింది. కానీ ఇప్పుడు చూస్తే కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ట్రాఫిక్‌లో మొబైల్‌లో వాడుతూ నాని దొరికిపోవడం, అర్జెంట్‌గా ఆఫీసుకు వెళ్లాల్సి రావడంతో చాలా కంగారుగా ఉంటాడు. సినిమా చూసిన వాళ్లకు ఆ సీన్‌ ఎలా ఉండొచ్చో తెలిసే ఉంటుంది.

హెల్త్‌ చెకప్‌ కోసం లీలా (నజ్రియా)ను తన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో సుందరం అలియాస్‌ నాని వెంటనే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఆ టెన్షన్‌లో ఉండగా మార్గ మధ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ఆపుతారు. ఆర్సీ, బండి కాగితాలు అడుగుతారు. అయితే మా అమ్మమ్మకు ఆరొగ్యం బాలేదని చెప్పి సుందరం అక్కడి నుండి బయలుదేరుతాడు. అయితే వెంటనే కారు ఆపేసి వెనక్కి వచ్చి ‘నేను చెప్పిన రీజన్‌ తప్పని, కానీ వెళ్లడం అర్జెంట్‌’ అని చెప్పి వెళ్లిపోతాడు. సీరియస్‌గా ఉన్నా ఫుల్లుగా నవ్వించే సీన్‌ ఇది.

థియేటర్లలో జూన్‌ 10న విడుదలైన ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. మరి నాని అలియాస్‌ సుందరం, లీలా అలియాస్‌ నజ్రియా సందడి మీరూ చూసేయండి. మతాంతర వివాహం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని, నజ్రియా అదరగొట్టేశారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!


టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus