బుల్లితెరపై కూడా నిరాశపరిచిన ‘అంటే సుందరానికి’

నేచురల్ స్టార్ నాని హీరోగా మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటించిన ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. పాజిటివ్ టాక్ వచ్చినా ఈ మూవీకి మినిమం ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించింది.

నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ముద్ర పడింది. పైగా సక్సెస్ ఫుల్ చిత్రాలకు ‘మైత్రి’ కేరాఫ్ అడ్రస్. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే మంచి ఓపెనింగ్స్ ను ఎందుకు రాలేదు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అటు తర్వాత ఈ సినిమాని ఓటీటీలో చూసిన జనాలు మాత్రం ‘సినిమా సూపర్’ ‘క్లాసిక్’ ‘ఫీల్ గుడ్ మూవీ’ అంటూ ట్వీట్లు పెట్టారు. కొందరైతే వివేక్ సాగర్ సంగీతం కూడా సూపర్ అంటూ చెప్పుకొచ్చారు.

మరి అలాంటి జనాలు థియేటర్ కు వెళ్లి సినిమా ఎందుకు చూడలేదో అర్ధం కాదు. సరే మొత్తానికి డిజిటల్ రైట్స్ కొన్న నెట్ ఫ్లిక్స్ సంస్థ మాత్రం హ్యాపీ అని టాక్. వాళ్ళు పెట్టిన దానికి సేఫ్ అయ్యారు అని వినికిడి. ఇదిలా ఉండగా.. ‘అంటే సుందరానికి’ మూవీ టెలివిజన్ ప్రీమియర్ ఇటీవల జెమినీ టీవీలో టెలికాస్ట్ అయ్యింది. కొన్ని సినిమాలు థియేటర్ లో సక్సెస్ కాకపోయినా ఓటీటీలో, టీవీల్లో సక్సెస్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.

అదే విధంగా ‘అంటే సుందరానికి’ మూవీ కూడా టీవీల్లో సక్సెస్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇక్కడ కూడా ‘అంటే సుందరానికి’ డిజాస్టర్ అనిపించుకుంది. మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ మూవీ కేవలం 1.88 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది. ‘అంటే సుందరానికి’ శాటిలైట్ రైట్స్ ను జెమినీ వారు రూ.8 కోట్లకు పైగా రేటు పెట్టి కొనుగోలు చేసినట్లు టాక్. దీంతో రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు మ్యాగ్జిమమ్ టి.ఆర్.పి ని నమోదు చేస్తే తప్ప కష్టమనే చెప్పాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus