‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కి.. మొదట్లో పెద్ద ప్రాజెక్టులు తలుపు తట్టాయి. కెరీర్ ప్రారంభంలో ఏ హీరోయిన్ కి సాధ్యం కాని విధంగా పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ , అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు’ ఇండియా వంటి బడా ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా నటించింది. అవి హిట్ అయితే కచ్చితంగా ఈమె రేంజ్ మరోలా ఉండేదేమో కానీ.. అవి ప్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి.
తమిళంలో అయితే ‘డిటెక్టివ్’ వంటి హిట్ సినిమాలో ఈమె నటించింది. కానీ తెలుగులో అయితే ఈమెకి పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాలేదు. తర్వాత యంగ్ హీరోల సినిమాల్లో ఈమె నటించినప్పటికీ అంతగా కలిసొచ్చింది ఏమీ లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. అది ఫ్లాప్ అయ్యింది. అల్లు శిరీష్ తో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో నటించింది ..
దానికి హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ఇక రవితేజతో చేసిన ‘రావణాసుర’ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘జపాన్’ సినిమా ఒక్కటే ఉంది. కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది అను ఇమ్మాన్యుయేల్.
ఇది కనుక సక్సెస్ అయితే తమిళంలో మంచి ఆఫర్లు వస్తాయి. అక్కడ హీరోయిన్ల కొరత ఎక్కువగానే ఉంది కాబట్టి.. అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) పై దర్శకనిర్మాతలు దృష్టి పెట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమవుతుందో..!
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!