ఇది ఇప్పటి మాట కాదు.. కానీ కరోనా – లాక్‌డౌన్‌తో మొత్తం ప్రపంచం ముఖ్యంగా భారత్ అతలాకుతలం అయిపోతున్న రోజుల మాట. అప్పట్లో ఎవరి ఆరోగ్యం వారిది అనే అనుకుంటున్నప్పుడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అదే ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని. ఏమైందో తెలియదు కానీ ఆయన రీహ్యాబిలిటేషన్ సెంటర్‌లో జాయిన్ అయ్యారని కూడా వార్తలొచ్చాయి. దాని వెనుక కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు.
‘బ్లాక్ ఫ్రైడే’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ లాంటి సినిమాలతో స్టార్ దర్శకుడు పేరు సంపాదించారు అనురాగ్ కశ్యప్. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌ని వదిలేసి సౌత్‌కి వచ్చేస్తున్నా అని వచ్చేశారు. దాని వెనుక ఏవేవో కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లలో ఆయన ఎదుర్కొన్న ఫెయిల్యూర్లు, బాలీవుడ్ రాజకీయాలు లాంటి వాటిలో కొన్ని అని అంటారు. అయితే ఇప్పుడు ఆయన ఓటీటీలకు సినిమాలు, సిరీస్‌లు నిర్మించే పనిలో ఉన్నారు. అలాగే నటుడిగానూ బిజీ అవుతున్నారు. ఇవన్నీ ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌కే చేస్తున్నారు.
తనకు నాన్ సినిమా లైఫ్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్ వల్లే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు అనురాగ్. నెట్‌ఫ్లిక్స్ కోసం చేయాల్సిన ‘మాగ్జిమం సిటీ’ అనే ప్రాజెక్టు కారణంగానే తీవ్ర ఇబ్బంది పడినట్లు అనురాగ్ ఇటీవల వెల్లడించాడు. ఆ ప్రాజెక్టు కోసం చాలా డబ్బు, సమయం ఖర్చు పెట్టానని చెప్పిన ఆయన.. ఆ కథేంటో తెలియకుండానే నెట్‌ఫ్లిక్స్ ఆ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిందని తెలిపారు. కానీ ఆ సినిమా విషయంలో నెట్‌ఫ్లిక్స్ ఒక్కసారిగతా సైలెంట్ అయిపోయి దాని బదులు వేరే స్క్రిప్టు ఇచ్చిన దాన్ని డైరెక్ట్ చేయమని చెప్పిందని తెలిపారు.
ఆ స్క్రిప్ట్ సరిగా లేకపోవడంతో టైం అడిగారట అనురాగ్. అయితే నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఓకే అవ్వలేదట. తాము అనుకున్న ఆర్టిస్టుల డేట్లు ఖాళీగా ఉన్నాయంటూ ఒత్తిడి తెచ్చి ఆ సిరీస్ చేశారట. దాని వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొని రెండుసార్లు గుండెపోటు కూడా వచ్చిందని చెప్పారు. రక్తం పలచబడేలా చేసేందుకు కొన్ని మందులు వాడగా, అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయట. దాని వల్ల ఆస్తమా వచ్చిందని, స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని అనురాగ్ తెలిపారు.
దావంతో రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చిందట. అదే సమయంలో కాలికి గాయమవ్వగా సర్జరీ చేసే పరిస్థితి లేకపోవడంతో వేరే మందులు వాడారట. వీటన్నింటి వల్ల కొన్ని నెలల పాటు వీల్‌ఛైర్‌కు పరిమితం అయ్యానని అనురాగ్ కశ్యప్ తెలిపారు.