మొదటి సినిమా విడుదల కాకుండానే మరో ఛాన్స్ కొట్టేసాడు..!

‘ఆకాశరామన్న’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు జి.అశోక్. అల్లరి నరేష్, శివాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ చిత్రం సక్సెస్ కాకపోగా.. ఓ కొరియన్ చిత్రాన్ని కాపీ కొట్టాడు అనే ఆరోపణలను ఎదుర్కొన్నాడు ఈ దర్శకుడు. అయితే తరువాత నేచురల్ స్టార్ నానితో చేసిన ‘పిల్ల జమిందార్’ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇప్పటికీ బుల్లితెర పై చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అయితే దీని తరువాత చేసిన ‘సుకుమారుడు’ ‘చిత్రాంగద’ చిత్రాలు ఇతను చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

అయినప్పటికీ ‘యూవీ క్రియేషన్స్’ వారిని మెప్పించి అనుష్కతో ‘భాగమతి’ అనే చిత్రాన్ని చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.ఇప్పుడు అదే చిత్రాన్ని ‘దుర్గావ‌తి’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాడు అశోక్. హీరో అక్ష‌య్ కుమార్, భూష‌ణ్ కుమార్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుష్క పాత్రలో అక్కడ భూమి ప‌డ్నేక‌ర్ కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబ‌రు 11న‌ అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కాబోతోంది.

అయితే బాలీవుడ్లో మొదటి చిత్రం విడుదల కాకుండానే.. అక్కడ ఇతనికి మరో సినిమా చేసే ఛాన్స్ దక్కిందట. ‘ఉఫ్’ పేరుతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నాడట అశోక్. ఈ చిత్రంలో మాటలు ఉండవట. నుష్ర‌త్ బ‌రూచా, నోరా ఫ‌తేహి, సోహ‌మ్ షా వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్ర‌లు పోషించ‌బోతున్నారని సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus