Anushka: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అనుష్క పోస్ట్ వైరల్..!

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ టైములో ఇలా వచ్చి అలా మాయమైపోయింది మెరుపు తీగలా..! అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆమె పెట్టిన లేటెస్ట్ పోస్ట్ వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే.. నిన్న అనుష్క తండ్రి విట్టల్ శెట్టి పుట్టినరోజు కావడంతో ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది అనుష్క.

Click Here To Watch NOW

‘సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ నాకు ఎంత వయసొచ్చింది అనేది నాకు అనవసరం. నేనెప్పటికీ మీ క్యూట్ చిన్న పిల్లనే… హ్యాపీ బర్త్ డే పపా’ అంటూ రాసుకొచ్చింది అనుష్క. దీంతో పాటు తన తండ్రితో దిగిన ఫోటోని కూడా జతచేసింది. ఈ ఫొటోలో ఆమె క్యూట్‌ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘నిశ్శబ్దం’ మూవీ తర్వాత అనుష్క సినిమాలను తగ్గించింది.

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఓ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘యూవీ క్రియేషన్స్’ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది అనుష్కకి 48 వ చిత్రం కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో అనుష్కకి ఉన్న స్టార్ డం అంతా ఇంతా కాదు.నయన్ కంటే కూడా అనుష్కకి క్రేజ్ ఎక్కువ అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఈమె చేసే విమెన్ సెంట్రిక్ మూవీస్ కు భారీ బిజినెస్ జరుగుతుంటుంది.

ఈమె ఓకె చెబితే చాలా మంది స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ తమ సినిమాల్లో నటించమని కోరడానికి రెడీగా ఉన్నారు. కానీ అనుష్క మాత్రం ఎంతో నచ్చిన కథ దొరికితే తప్ప సినిమాలు చేసేలా లేదు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news