మెగాస్టార్ పక్కన స్వీటీ ఖరారు

  • May 24, 2016 / 01:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ సినిమా కత్తిలాంటోడుకి హీరోయిన్ ఖరారు అయింది. స్టాలిన్ సినిమాలో చిరుతో ప్రత్యేక పాటలో నర్తించిన అనుష్క మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్నిస్వయంగా స్వీటీ నే చెప్పింది. ఈ సినిమా కోసం ఆమె ఎక్కువ కాల్షీట్లు ఇచ్చినట్లు పేర్కొంది. అనుష్క ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ చిత్రం క్లైమాక్స్ షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే కత్తిలాంటోడు రెగ్యులర్ షూటింగ్ లో ఆమె పాల్గొంటారని యూనిట్ వర్గాలు తెలిపాయి.

వీ వీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్నఈ సినిమాకు ప్రీ పొడక్షన్ వర్క్ పూర్తి అయింది. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో ప్రత్యేక పాటలో చిరంజీవి పక్కన స్టెప్పులు వేసే భామను కూడా సెలెక్ట్ చేసారు. ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు సినిమాలలో స్టైలిష్ స్టార్ బన్నీతో కాలు కదిపిన అందాల నటి కేథరిన్ చిరుతో స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పింది. ఈ కాంబినేషన్లు అభిమానుల అంచనాలను పెంచేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus