Anushka: మూడుసార్లు ఆ మెగా హీరోని రిజెక్ట్ చేసిన అనుష్క!

  • November 9, 2023 / 07:21 PM IST

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనుష్క ఒకానొక సమయంలో వరుస తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ పలు భాషా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా అనుష్కకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా నటించి మెప్పించారు.

అయితే మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తో మాత్రం ఈమె ఇప్పటివరకు ఒక సినిమాలో నటించలేదు. అయితే మూడుసార్లు రాంచరణ్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా అనుష్క మూడు సార్లు రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. మరి రామ్ చరణ్ అనుష్క కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రావలసినటువంటి ఆ మూడు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే…

రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మగధీర సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా రాజమౌళి అనుష్కని అనుకున్నారట ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అనంతరం రచ్చ సినిమాలో కూడా ముందుగా అనుష్కకి అవకాశం రావడంతో ఈ సినిమా కథ నచ్చక ఈమె ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేశారట.

ఇక మూడోసారి వీరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రావలసిన సినిమా గోవిందుడు అందరివాడే ఈ సినిమాలో కృష్ణవంశీ ముందుగా అనుష్కను సంప్రదించగా ఈమె అప్పటికి వేరే సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఛాన్స్ వదులుకున్నారట ఇలా మూడుసార్లు రాంచరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ అనుష్క (Anushka) ఈ సినిమా అవకాశాలను వదులుకున్నారు అంటూ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus