టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క సెప్టెంబర్ నెల 7వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమకు అనుష్క భారీ రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. జాతిరత్నాలు సినిమాతో సక్సెస్ సాధించిన నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. గతంలో మూడు కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్న అనుష్క ప్రస్తుతం 6 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క రెమ్యునరేషన్ గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
ఇతర భాషల్లో కూడా అనుష్కకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఆమెకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కుతోందని సమాచారం అందుతోంది. సినిమా ఇండస్ట్రీలో అనుష్కకు చాలామంది స్నేహితులు ఉన్నారు. అయితే అనుష్క డబ్బు కన్నా మనుషులకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. అనుష్క రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ అనుష్కలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని పొందుతారో చూడాల్సి ఉంది.