చక్కర్లుకొట్టనున్న అనుష్క

  • June 28, 2016 / 11:52 AM IST

పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్ననటి అనుష్క శెట్టి. ఈ కన్నడ సుందరి అత్యధిక పారితోషికం అందుకోవడంలోనూ టాప్ పొజిషన్లో ఉంది. ప్రస్తుతం ఈమె బాహుబలి కంక్లూజన్ షూటింగ్లో పాల్గొంటోంది. బాహుబలి – ది బిగినింగ్ లో డీ గ్లామరైజ్ గా కనిపించిన స్వీటీ రెండో పార్ట్ లో అందగత్తెగా, వీర వనితగా నటనను ప్రదర్శించనుంది. ఈ సినిమాతో పాటు సూర్య సింగం కొనసాగింపుగా వస్తున్న “ఎస్ త్రీ” ఫిల్మ్ లోనూ నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ రెండు చిత్రాల కోసం అనుష్క చెన్నై, హైదరాబాద్ ల మధ్య తిరుగుతోంది.

ఇంత రిస్క్ లోనూ అరుంధతి, రుద్రమదేవి తరహాలో భాగమతి చిత్రంలో టైటిల్ రోల్ పోషించడానికి సిద్ధమైంది. ఈ మూవీ వచ్చే నెల 6 నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ ని పది రోజుల్లో కంప్లీట్ చేసి లండన్ కి వెళ్లనుంది. అక్కడ అజిత్ “తల 57” మూవీ మొదటి షెడ్యూల్ జులై 15 నుంచి ప్రారంభం కానుంది. ఆ చిత్రంలోనూ అనుష్క ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. 15 రోజుల పాటు సాగే చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ సినిమా దాదాపు పూర్తిగా విదేశాల్లోనే తెరకెక్కనుంది. అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తికాగానే అనుష్క ఇండియాకు తిరిగి వచ్చి బాహుబలి, ఎస్ త్రీ, భాగమతి షూటింగ్లో బిజీ కానుంది. ఇలా తన చిత్రాల షూటింగ్ నిమిత్తం కొన్నిరోజులు లండన్లో, మరికొన్ని రోజులు చెన్నై లో, మిగిలిన రోజులు హైదరాబాద్ లో ఉండనుంది. ఇక ఏ రోజైన ఖాళీ దొరికితే బెంగుళూర్ లోని తన కుటుంబ సభ్యులతో గడపనుంది. ఈ నాలుగు చిత్రాలు పూర్తయ్యే వరకు అంటే ఏడాది (ఇంకా ఎక్కువ కాలం పట్టవచ్చు) వరకు నాలుగు ప్రాంతాల మధ్యన ఈ బ్యూటీ చక్కర్లు కొట్టనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus