మరో వైవిధ్యమైన పాత్ర స్వీటీకి దొరికినట్టే..!

కోలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ధనుష్ ‘అసురన్’ కూడా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ చిత్రం ప్లాట్.. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని అలరించింది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన సురేష్ బాబు ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు. ఇక ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేదాని పై చాలా డిస్కషన్లు జరిగాయి. ఓంకార్, హను రాఘవపూడి పేర్లు వినిపించినప్పటికీ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతున్నట్టు సురేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

విక్టరీ వెంకటేష్ 74వ చిత్రంగా ఈ రీమేక్ తెరకెక్కబోతుంది. ఇక ‘అసురన్’ లో హీరోయిన్ మంజు వారియార్ పాత్ర కూడా చాలా కీలకమైంది. మరి తెలుగు రీమేక్ లో ఎవరు నటిస్తారు అనేదాని పై కూడా చాలా వార్తలు వచ్చాయి. వెంకటేష్ తో రెండు సినిమాలు చేసిన శ్రీయ శరన్ హీరోయిన్ గా నటిస్తుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం స్టార్ హీరోయిన్ అనుష్క నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అనుష్క అయితే ఈ పాత్రకి కరెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. ఇక వెంకీ తో అనుష్క గతంలో ‘చింతకాయల రవి’ ‘నాగవల్లి’ వంటి చిత్రాల్లో నటించింది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus