మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మరోపక్క ‘విశ్వంభర’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు 2026 లో విడుదల కానున్నాయి. మరోపక్క నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా చిరు సెట్ చేసుకోవడం జరిగింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీతో మరో సినిమా చేయబోతున్నారు. తెలుగులో ‘మైత్రి మూవీ మేకర్స్’ మాదిరి తమిళంలో దూసుకుపోతున్న ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. మెగాస్టార్ కెరీర్లో 158 వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని (Anushka) ఎంపిక చేసుకున్నారంటూ ఓ టాకైతే రన్ అవుతుంది.
దీంతో ఈ ప్రాజెక్టు వార్తల్లో నిలిచింది. స్వీటీ కనుక ఈ ప్రాజెక్టులో భాగం అయితే కచ్చితంగా హైప్ పెరుగుతుంది. ఇటీవల దర్శకుడు బాబీ.. అనుష్కని కలిసి కథ వినిపించారట. ఆమె కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. గతంలో చిరు (Chiranjeevi) నటించిన ‘స్టాలిన్’ సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్లో చిరుతో కలిసి స్టెప్పులేసింది. ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘సైరా నరసింహారెడ్డి’ లో కూడా కీలక పాత్ర పోషించింది.
ఆ సినిమా కోసం ‘ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోకుండా.. కనీసం ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చి చేసింది’ అంటూ చిరంజీవి (Chiranjeevi) ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. చిరుపై అనుష్కకి (Anushka) ఆ రేంజ్ రెస్పెక్ట్ ఉంది. కాబట్టి మెగా 158 లో భాగం కావాల్సి వస్తే అనుష్క వెనకడుగు వేయదు. కానీ ఇక్కడ టీం ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.