“సన్యాసి” గా మారిన సెక్సీ బ్యూటీ…!!!

టాలీవుడ్ సెక్సీ బ్యూటీ అనుష్క అభిమానులకు షాక్ ఇచ్చింది. అనుకోని పరిస్థితుల్లో సన్యాసిగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ లో సూపర్ సినిమాతో సూపర్ డూపర్ హీరోయిన్ గా మారిపోయిన అందాల భామ అనుష్క రేంజే వేరు. వరుస సినిమాలతోనే కాదు…సూపర్ హిట్స్ తో కూడా మంచి ఊపు మీద ఉన్న ఈ అందాల భామ, ప్రస్తుతం సింగం-3, బాహుబలి పార్ట్ 2 నటిస్తుంది.

తన నటనతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సరికొత్త ఉత్సాహాన్ని అందించిన ఈ బ్యూటీ…నాగ్ తో కలసి ఒక బయోపిక్ లో కనిపించనుంది. కింగ్ నాగార్జున నటిస్తున్న హతిరాం బాబా బయోపిక్ ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ తో పాటు ఈ బ్యూటీ కూడా నటిస్తుంది. అయితే ఈ బయోపిక్ లో అనుష్కకు సూపర్ పాత్ర లభించింది. అప్పట్లో క్రిష్ సంధించిన ‘వేదం’ లో వేశ్య పాత్రలో నటించి మెప్పించిన ఆమె, ఇప్పుడు ఇందులో మంచి రోల్ ప్లే చేస్తుందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం స్వీటీ అనుష్క సినిమాలో సన్యాసిగా కనిపిస్తుందట.

మరి హాట్ ఇమేజ్ ఉన్న అనుష్క సన్యాసిగా మెప్పిస్తుందా అంటే తన కెరియర్ లో ఎప్పుడు ప్రయోగాలకు పట్ట వేసే అమ్మడు కథ గురించి తన పాత్ర గురించి తెలియగానే ఓకే చెప్పిందట. గత ఏడాది…సైజ్ జీరోతో సరికొత్త ప్రయోగం చేసిన ఈ భామ, బాహుబలి1లో సాహసవంతమైన పాత్రను నటించింది. ఇలా ప్రేక్షకులు తనని కేవలం హాట్ గానే కాదు అభినయం ఉన్న పాత్రల్లో నటించినా ఆదరిస్తారు అన్న గట్టి నమ్మకంతో ఈ పాత్రకు ఒప్పుకుంది హాట్ స్వీటి. మరి ఈ డేరింగ్ డిసిషన్ ఎంతవరకూ పనికొస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=62FdLCHbd_8

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus