ఇక థియేట్రికల్ లేదు.. ఆన్లైన్లోనే అనుష్క సినిమా..!

‘భాగమతి’ చిత్రం తరువాత అనుష్క నుండీ రాబోతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండే వంటి స్టార్ క్యాస్ట్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కోన ఫిలిం కార్పొరేషన్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ల పై టి.జి.విశ్వ ప్రసాద్ మరియు కోన వెంకట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘బాహుబలి’ తరువాత అనుష్క మార్కెట్ మరింత పెరిగింది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చెయ్యాల్సి ఉండగా.. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూటపడటంతో వాయిదా వేశారు.అయితే ఇప్పటికీ లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్న తరుణంలో.. ‘నిశ్శబ్దం’ ను డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదు. కచ్చితంగా థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది అని నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుండడంతో భారీగా ఇంట్రెస్ట్ లు కడుతూ వస్తున్నారట నిర్మాతలు.

ఇక అమెజాన్ వారు కూడా భారీ రేట్ ఆఫర్ చెయ్యడంతో ఆన్లైన్ లో విడుదల చెయ్యడమే కరెక్ట్ అనే ఉద్దేశానికి నిర్మాతలు వచ్చేశారట. అతి త్వరలోనే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం కోసం అనుష్క అభిమానులు మాత్రమే కాదు లాక్ టైం కాబట్టి మిగిలిన ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus