Akhanda 2: ‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

ఇతర భాషల నుండి వచ్చిన డబ్బింగ్‌ సినిమాలకే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరల పెంపు అవకాశం ఇస్తున్నారు. అలాంటిది తెలుగు సినిమా పరిశ్రమ నుండి, అందులోనూ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే చేసిన సినిమాకు టికెట్‌ ధరల పెంపు గురించి మరో ఆలోచన ఉంటుంది అని చెప్పలేం. అందులోనూ అది నందమూరి బాలకృష్ణ సినిమా కాబట్టి అస్సలు లేదు. ఇదంతా ‘అఖండ 2: తాండవం’ సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏపీలో ఈ సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై క్లారిటీ వచ్చేసింది. ఈ రోజు తెలంగాణలో వస్తుంది అంటున్నారు.

Akhanda 2

‘అఖండ 2: తాండవం’ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డిసెంబర్ 4న వేయబోయే ప్రీమియర్లకు రూ.600 టికెట్ రేటును కూడా నిర్ణయించి జీవో రిలీజ్‌ చేసేశారు. ఇక డిసెంబర్ 5 నుండి 10 రోజుల పాటు పెరిగిన ధరలు వర్తిస్తాయని చెబుతూ.. సింగల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.100 పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. అలాగే రోజుకు అయిదు షోల చొప్పున వేసుకునే ఆప్షన్‌ ఇచ్చారు. గతంలో పెద్ద సినిమాలకు ఏపీ ప్రభుత్వం రూల్సే పెట్టింది.

దీంతో, ఇప్పుడు బంతి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పడింది. సినిమా టికెట్‌ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం నుండి జీవో రావాల్సి ఉంది. తెలంగాణలో కూడా ఇంచుమించు ఏపీ ఫార్ములానే ఫాలో అయ్యే అవకాశముంది. అయితే సినీ కార్మికుల నిధికి పాతిక శాతం ఇస్తేనే టికెట్‌ ధరల పెంపునకు అనుమతిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాకు ఆ రూల్‌ పాటిస్తుందో లేదో అనేది చూడాలి. అయితే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఇంకా రాలేదు. కాబట్టి ముందస్తుగా టీమ్‌ తమ 25 శాతం వాటాను అనౌన్స్‌ చేస్తుంది అని అంటున్నారు.

వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus