అప్పట్లో ‘మనం’ సినిమాలోని క్లైమాక్స్ లో క్యామియో రోల్ ద్వారా స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టి, తరువాత వి వి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ మూవీతో టాలీవుడ్ లోకి హీరో గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఆ మూవీకి ఇద్దరి మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయటం అప్పట్లో హైలైట్. కానీ అఖిల్ మూవీతో పాటు దాని తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన టాక్ కానీ, కలెక్షన్లు కానీ అందుకోలేకపోయాయి.
ప్రస్తుతం అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. ఈ మూవీకి మురళీకృష్ణ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీలో మొదటగా శ్రీ లీలను హీరోయిన్ గా కొంత షూట్ కూడా చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల శ్రీ లీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో భాగ్యశ్రీ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వగా, శ్రీలీల నటించిన సీన్స్ వరకు రీ షూట్ చేయాల్సి ఉందంట. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
రీ షూట్ లో భాగంగా హీరోయిన్ భాగ్య శ్రీ షూటింగ్లో బిజీ అవ్వనుందని సమాచారం. 2026 వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14న) నిఖిల్ హీరోగా ‘స్వయంభు’ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతుండగా, అదే రోజున అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా, ఈ సారి వాలెంటైన్స్ డే కి యువ హీరోలు అఖిల్ & నిఖిల్ పోటీ పడబోతున్నారని సినీ వర్గాల నుంచి వినపడుతున్న టాక్.