సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు, తమిళం, హిందీలో భారీ హిట్ అందుకోవడానికి అడుగులు వేస్తున్నారు. కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించనున్నసినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో తమిళ్ డైరక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించనున్నాడని వార్తలు వినిపించడంతో అందరి దృష్టి ఈ చిత్రం పై పడింది.
ఈరోజు (బుధవారం) ఏ.ఆర్.మురుగదాస్ ట్విట్టర్లో “నా తదుపరి చిత్రంలో అంటాగానిస్ట్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నాడు” అని స్పష్టం చేసాడు. అతను పోస్ట్ చేసిన వెంటనే “నేను నటించడానికి ఎదురుచూస్తున్నాను” అని సూర్య రీ ట్వీట్ చేసాడు. ఒక దర్శకుడు, నటుడు అయిన సూర్య విలన్ పాత్ర చేయడానికి ఇంత ఉత్సాహంగా ఉన్నాడంటే ఆ సినిమా ఇంకెంత బాగుంటుందో అని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.
ఎస్.జె.సూర్య గతంలో మహేష్ బాబును డైరెక్ట్ చేసాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “నాని” విమర్శకుల ప్రసంశలు అందుకున్నా.. విజయం అందుకోలేక పోయింది. ఇప్పుడు ఆ డైరక్టరే మహేష్ కి విలన్ గా రాబోతున్నాడు. ఈ కాంబినేషన్ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం వెచ్చే నెల 19 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
@iam_SJSuryah plays antagonist in my next 😎 Looking forward to work with him …
— A.R.Murugadoss (@ARMurugadoss) June 8, 2016
Same here sir 🙏 Sjs https://t.co/vgo7zwKI1Y
— S J Suryah (@iam_SJSuryah) June 8, 2016