మెగాస్టార్ డ్రీమ్ ప్రొజెక్ట్ “సైరా నరసింహారెడ్డి” నుండి రెహమాన్ తప్పుకొన్నాడనే వార్తల్లో నిజమెంతో ఇంకా ఎవరికీ తెలియదు కానీ.. మెగా 151వ సినిమాను వాదులుకొన్న (?) రెహమాన్ వేరే తెలుగు సినిమా సైన్ చేసినట్లు సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంళో తెరకెక్కనున్న బైలింగువల్ 2018లో సెట్స్ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రెహమాన్ ను అనుకొంటున్నారని. రెహమాన్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడని వినికిడి. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతుండడం, అల్లు అర్జున్ తమిళ డెబ్యూ కూడా కావడంతో రెహమాన్ అయితేనే ఇంటర్నేషన్ లెవల్ లో ఉంటుందని చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.
అయితే.. రెహమాన్ ఎప్పుడో 2018లో మొదలవ్వాబోయే అల్లు అర్జున్ సినిమా ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు కానీ.. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రిపేర్ అవుతున్న “సైరా నరసింహా రెడ్డి” సినిమా గురించి ఎలాంటి చప్పుడు చేయకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ చిరంజీవి అండ్ కో మరియు అల్లు అర్జున్ అండ్ కో గా డివైడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ పరిణామం ఈ రెండు వర్గాల అభిమానుల నడుమ మాటల యుద్ధానికి తెరతీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.