సింగర్ అయిన రెహ్మాన్ కొడుకు

  • February 27, 2016 / 12:00 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తన సంగీతంతో దేశ సినీ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెహ్మాన్ కుమారుడు అమీన్ కూడా తొలిసారి తెలుగులో ఒక పాట పాడి సింగర్ గా తెలుగులో అరంగేట్రం చేసాడు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘నిర్మల కాన్వెంట్’ చిత్రంలో అమీన్ పాట అద్భుతంగా పాడారని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది

ప్రస్తుతం నిర్మల కాన్వెంట్ చిత్రంలోని పాట కూడా అద్భుతంగా పాడారని రికార్డింగ్ బాగా వచ్చిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి నాగార్జున మరియు నిమ్మగడ్డ ప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. జికే మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రోషన్ సరసన శ్రేయాశర్మ నటిస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus