సినిమా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను సంపాదించుకునే హీరోయిన్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి హీరోయిన్లలో ఐశ్వర్యారాయ్ ఒకరు కాగా ఈ హీరోయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఉంది. ఐశ్వర్యారాయ్ వయస్సు 50 సంవత్సరాలు అయినా ఆమెను డైరెక్ట్ గా చూసిన వాళ్లెవరూ ఆమె వయస్సు గురించి నమ్మడానికి అస్సలు ఇష్టపడరు. అయితే ఐశ్వర్యారాయ్ ఈ నెల 1వ తేదీన పుట్టినరోజు జరుపుకోగా ఐశ్వర్యారాయ్ గురించి ఆరాధ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
అమ్మ చేసే సేవా కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని ఎంతో అద్భుతమైనవని ఐశ్వర్యారాయ్(Aradhya) కూతురు ఆరాధ్య అన్నారు. అమ్మ చుట్టూ ఉండేవాళ్లకు, ప్రపంచంలోని ఇంకెంతో మంది ప్రజలకు చేసే సహాయం నిజంగా నమ్మశక్యం కాదని ఆరాధ్య పేర్కొన్నారు. ఆరాధ్య వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అమ్మపై ఆరాధ్య చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఐశ్వర్యారాయ్ కు ఇప్పటికీ వరుస ఆఫర్లు వస్తున్నా ఆమె మాత్రం పరిమిత సంఖ్యలో ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఐశ్వర్యారాయ్ కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఐశ్వర్యారాయ్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్లుగా ఉంది. ఐశ్వర్యారాయ్ కథల ఎంపిక విషయంలో మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐశ్వర్యారాయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఐశ్వర్యారాయ్ భవిష్యత్తులో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐశ్వర్యారాయ్ రెమ్యునరేషన్ 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. టాలీవుడ్ సినిమాలకు కూడా ఈ హీరోయిన్ ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.