ఏ తండ్రికైనా కొడుకు, కూతురు ఉన్నారంటే, ఓ పావు కేజీ ప్రేమ కూతురి పైనే ఎక్కువగా చూపిస్తాడు. ఇది నిజజీవితంలో అందరూ చూస్తూనే ఉంటారు. తండ్రీ కొడుకుల బంధం కంటే కూడా తండ్రీ కూతుర్ల బంధం ప్రత్యేకమైనది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది వినడానికి కూడా క్యూట్ గా స్వీట్ గా అనిపిస్తుంది. అందుకే ఇలాంటి నేపథ్యంలో కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.
త్వరలో కూతురి సెంటిమెంట్ తో రూపొందిన కొన్ని క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. అవే బాలకృష్ణ, శ్రీలీల కాంబినేషన్లో రూపొందిన ‘భగవంత్ కేసరి’, వెంకటేష్ నటిస్తున్న ‘సైందవ్’ , నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు కూడా క్రేజీ ప్రాజెక్టులే అని చెప్పాలి. అన్నిటి పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. గతంలో కూడా ఈ థీమ్ తో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయో.. ఎన్ని ప్లాప్ అయ్యాయో ఓ లుక్కేద్దాం రండి :
1) రాయుడు :
మోహన్ బాబు హీరోగా సౌందర్య, రచన హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో కూతురి పాత్రలో ప్రత్యూష నటించింది. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా 1998లో రిలీజ్ అయ్యి ప్లాప్ గా మిగిలింది. అయితే ఇందులో తండ్రి కూతుర్ల మధ్య బాండింగ్ ను బాగా చూపించారు.
2) దేవీ పుత్రుడు :
వెంకటేష్ హీరోగా సౌందర్య, అంజలి జావేరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో కూతురి పాత్రలో బేబీ చెర్రీ నటించింది. కోడి రామకృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా 2001లో రిలీజ్ అయ్యి ప్లాప్ గా మిగిలింది. ఇందులో తండ్రి కూతుర్ల మధ్య బాండింగ్ ను బాగా చూపించారు.
3) డాడీ :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీని సురేష్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఇందులో కూతురి పాత్రలో అనుష్క మల్హోత్రా నటించింది. 2001 లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. కానీ తండ్రి కూతుర్ల బాండింగ్ ను ఈ మూవీలో బాగా చూపించారు.
4) విక్రమార్కుడు :
రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ 2006 లో రిలీజ్ అయ్యింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో కూతురి పాత్రలో బేబీ నేహా చాలా చక్కగా నటించింది.
5) ఆకాశమంత :
ప్రకాష్ రాజ్, త్రిష వంటి స్టార్లు తండ్రీకూతురు గా పోషించిన ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకుడు. 2008 లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.
6) నాన్న :
విక్రమ్ హీరోగా అమలా పాల్, అనుష్క లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కూతురి పాత్రలో సారా అర్జున్ నటించింది. ఏ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2011 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో కూడా తండ్రీకూతుర్ల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది.
7) ఎంతవాడుగాని :
అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకుడు. 2015 లో వచ్చిన ఈ చిత్రంలో అజిత్ కూతురిగా అనిక సురేంద్రన్ నటించింది. ఇందులో తండ్రి- కూతుర్ల బాండింగ్ బాగుంటుంది. అయితే సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.
8) విశ్వాసం :
అజిత్ హీరోగా నయనతార హీరోయిన్ గా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కూతురి పాత్రలో అనేక సురేంద్రన్ నటించింది. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
9) పోలీస్ :
విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కూతురి పాత్రలో మీనా కూతురు నైనిక నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
10) దర్బార్ :
రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, కూతురి పాత్రలో నివేదా థామస్ నటించింది. ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. కానీ రజినీ – నివేదా థామస్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి.