Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » అరవింద్ స్వామి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

అరవింద్ స్వామి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

  • December 21, 2016 / 02:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరవింద్ స్వామి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

రంగుల లోకం.. ఎన్నో రకాల అభిరుచులు కలిగిన వ్యక్తుల మయం. ఇక్కడ నటనే శ్వాస.. సినిమాలే జీవితం అనుకునేవారు ఉంటారు. జీవితంలో సినిమాలు ఒక భాగం మాత్రమే అనుకునేవారు ఉంటారు. రెండో వర్గానికి చెందిన వ్యక్తి అరవింద్ స్వామి. లవ్, ఎమోషన్ సీన్లలో అద్భుతంగా నటించి ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒక సారి స్టార్ హోదా దక్కితే దాన్ని నుంచి తప్పించుకోవడం కష్టం అంటుంటారు. కానీ ఆ మాటని బ్రేక్ చేసి సాధారణ లైఫ్ ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇతని రియల్, రీల్ లైఫ్ లో దాగిన ఆసక్తికర సంగతులు..

బాల్యంలో మిస్టరీAravind Swamyఅరవింద్ స్వామి చెన్నైలో 30 జూన్ 1970 జన్మించారు. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. అతని వద్ద కాకుండా పారిశ్రామికవేత్త వి. డి. స్వామి, భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి వద్ద పెరిగారు. ఆలా ఎందుకు పెరగాల్సి వచ్చిందో ఇంతవరకు ఎవరికీ అరవింద్ స్వామి చెప్పలేదు.

అమెరికాలో హయ్యర్ స్టడీస్Aravind Swamyశిష్య స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివారు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశారు. తరువాత అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

21 ఏళ్లకే దళపతిAravind Swamyఅరవింద్ స్వామిని సినిమాల్లోకి కోలీవుడ్ డైరక్టర్ మణిరత్నం తీసుకొచ్చారు. దళపతి సినిమాలో కలెక్టర్ గా నటించారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. అప్పుడు అరవింద్ స్వామి వయసు 21 సంవత్సరాలు. మణిరత్నం తనకి సినిమా గురువుగా అరవింద్ స్వామి భావిస్తుంటారు.

జాతీయ స్థాయిలో గుర్తింపుAravind Swamyదేశభక్తి చిత్రం “రోజా” ఐదు భాషల్లో అనువాదమై విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా అరవింద్ స్వామికి అభిమానులు ఏర్పడ్డారు. రెండు సినిమాలకే స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నారు.

సినిమాలు వదిలి ..Aravind Swamyరోజా చిత్రం తర్వాత స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ వాటిని ఇక్కడే వదిలేసి చదువుకోడానికి అమెరికా వెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచారు.

మరో ఆణిముత్యం బొంబాయిAravind Swamyస్టడీ పూర్తి చేసి వచ్చినంటనే మణిరత్నం డైరెక్షన్లోనే మరో మూవీ బొంబాయి చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అయింది.

పెళ్లి .. విడాకులుAravind Swamyబొంబాయి చిత్రం సమయంలోనే గాయత్రి రామమూర్తి ఆమెను అరవింద్ స్వామి పెళ్లి చేసుకున్నారు. వీరికి అదిరా స్వామి(అమ్మాయి), రుద్రా స్వామి(అబ్బాయి) అని ఇద్దరు పిల్లలు. పదహారేళ్లు కలిసి ఉన్న తర్వాత 2010 లో విడాకులు తీసుకున్నారు. పిల్లల పెంపకం మొత్తం అరవింద్ స్వామి తీసుకున్నారు. 2012 లో అపర్ణ ముఖర్జీ అనే ఆమెని పెళ్లి చేసుకున్నారు.

భారీ ప్రమాదంAravind Swamy2006లో అరవింద్ స్వామికి భారీ ప్రమాదం జరిగింది. వెన్నెముకకి గాయం అయింది. పక్షవాతం వచ్చింది. ఏడాదిపాటు నడవలేకపోయారు. మళ్లీ మామూలు వ్యక్తి కావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో లావు అయ్యారు.

పాజిటివ్ థింకింగ్Aravind Swamyఅరవింద్ స్వామి బెడ్ మీద ఉన్నప్పటికీ నిరాశ పడలేదు. అదే అతన్ని మామూలు మనిషిని చేయడానికి దోహదం చేసిందని భావిస్తుంటారు. కోలుకోగానే పనిలో బిజీ అయ్యారు. చెన్నై లో ట్యాలెంట్ మ్యాక్సిమస్ అనే సాఫ్ట్ వేర్ యాప్ డెవలప్ కంపెనీని అరవింద్ స్వామి స్థాపించి డెవలప్ చేశారు. ఈ కంపెనీకి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఈ కంపెనీకి క్లైంట్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర 5 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు

మళ్లీ మణిరత్నం వల్లే..Aravind Swamyసినిమాలకు దాదాపు పదేళ్లు దూరంగా ఉన్న అరవింద్ స్వామిని మణిరత్నమే మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చారు. కడలి అనే చిత్రంలో మంచి క్యారక్టర్ ఇచ్చారు. అందుకోసం అరవింద్ స్వామి ఒకటిన్నర నెలలో 18 – 20 కిలోల బరువు తగ్గారు.

విలన్ గా ఎంట్రీAravind Swamyగత ఏడాది తని వరువన్ చిత్రం ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇది సూపర్ హిట్ అయింది. ఇందులో నటనను మెచ్చి తెలుగు వెర్షన్ ధృవ లోను తీసుకున్నారు. ఇక్కడ కూడా అదరగొట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చారు.

టీవీ షోAravind Swamyకౌన్ బనేగా కరోడ్ పతి మాదిరిగా తమిళంలో రూపొందిన “నీంగళుమ్ వెళ్లాలం ఒరు కోడి” అనే రియాలిటీ షో కి హోస్ట్ గా ఛాన్స్ అందుకున్నారు. స్టార్ విజయ్ ఛానల్ ల్లో ప్రసారమయ్యే ఈ షో కు ఇదివరకు సూర్య, ప్రకాష్ రాజ్ హోస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ త్వరలో ప్రసారం కానుంది.

త్వరలో డైరక్టర్ గా ..Neengalum Vellalam Oru Kodiహీరో, విలన్ గా నిరూపించుకున్న అరవింద్ స్వామి డైరక్టర్ గా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది దర్శకత్వం చేయ డానికి రెండు కథల్ని సిద్ధం చేసుకొన్నారు. ఇటీవల ‘వనంగముడి’ అనే కథ పూర్తి చేశారు. ఒక పోలీసు పాతికేళ్ల జీవితం నేపథ్యంలో సాగే ఆ కథ అది. అందులో హీరోగా నటిస్తూ డైరక్షన్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravind Swamy
  • #Aravind Swamy and mani Ratnam
  • #Aravind Swamy Body
  • #Aravind Swamy Dalapathi Movie
  • #Aravind Swamy In Dhruva Movie

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

18 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 days ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 days ago

latest news

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

14 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

15 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

15 hours ago
ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version