అరవింద్ స్వామి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

  • December 22, 2016 / 12:01 PM IST

రంగుల లోకం.. ఎన్నో రకాల అభిరుచులు కలిగిన వ్యక్తుల మయం. ఇక్కడ నటనే శ్వాస.. సినిమాలే జీవితం అనుకునేవారు ఉంటారు. జీవితంలో సినిమాలు ఒక భాగం మాత్రమే అనుకునేవారు ఉంటారు. రెండో వర్గానికి చెందిన వ్యక్తి అరవింద్ స్వామి. లవ్, ఎమోషన్ సీన్లలో అద్భుతంగా నటించి ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒక సారి స్టార్ హోదా దక్కితే దాన్ని నుంచి తప్పించుకోవడం కష్టం అంటుంటారు. కానీ ఆ మాటని బ్రేక్ చేసి సాధారణ లైఫ్ ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇతని రియల్, రీల్ లైఫ్ లో దాగిన ఆసక్తికర సంగతులు..

బాల్యంలో మిస్టరీఅరవింద్ స్వామి చెన్నైలో 30 జూన్ 1970 జన్మించారు. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. అతని వద్ద కాకుండా పారిశ్రామికవేత్త వి. డి. స్వామి, భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి వద్ద పెరిగారు. ఆలా ఎందుకు పెరగాల్సి వచ్చిందో ఇంతవరకు ఎవరికీ అరవింద్ స్వామి చెప్పలేదు.

అమెరికాలో హయ్యర్ స్టడీస్శిష్య స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివారు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశారు. తరువాత అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

21 ఏళ్లకే దళపతిఅరవింద్ స్వామిని సినిమాల్లోకి కోలీవుడ్ డైరక్టర్ మణిరత్నం తీసుకొచ్చారు. దళపతి సినిమాలో కలెక్టర్ గా నటించారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. అప్పుడు అరవింద్ స్వామి వయసు 21 సంవత్సరాలు. మణిరత్నం తనకి సినిమా గురువుగా అరవింద్ స్వామి భావిస్తుంటారు.

జాతీయ స్థాయిలో గుర్తింపుదేశభక్తి చిత్రం “రోజా” ఐదు భాషల్లో అనువాదమై విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా అరవింద్ స్వామికి అభిమానులు ఏర్పడ్డారు. రెండు సినిమాలకే స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నారు.

సినిమాలు వదిలి ..రోజా చిత్రం తర్వాత స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ వాటిని ఇక్కడే వదిలేసి చదువుకోడానికి అమెరికా వెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచారు.

మరో ఆణిముత్యం బొంబాయిస్టడీ పూర్తి చేసి వచ్చినంటనే మణిరత్నం డైరెక్షన్లోనే మరో మూవీ బొంబాయి చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అయింది.

పెళ్లి .. విడాకులుబొంబాయి చిత్రం సమయంలోనే గాయత్రి రామమూర్తి ఆమెను అరవింద్ స్వామి పెళ్లి చేసుకున్నారు. వీరికి అదిరా స్వామి(అమ్మాయి), రుద్రా స్వామి(అబ్బాయి) అని ఇద్దరు పిల్లలు. పదహారేళ్లు కలిసి ఉన్న తర్వాత 2010 లో విడాకులు తీసుకున్నారు. పిల్లల పెంపకం మొత్తం అరవింద్ స్వామి తీసుకున్నారు. 2012 లో అపర్ణ ముఖర్జీ అనే ఆమెని పెళ్లి చేసుకున్నారు.

భారీ ప్రమాదం2006లో అరవింద్ స్వామికి భారీ ప్రమాదం జరిగింది. వెన్నెముకకి గాయం అయింది. పక్షవాతం వచ్చింది. ఏడాదిపాటు నడవలేకపోయారు. మళ్లీ మామూలు వ్యక్తి కావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో లావు అయ్యారు.

పాజిటివ్ థింకింగ్అరవింద్ స్వామి బెడ్ మీద ఉన్నప్పటికీ నిరాశ పడలేదు. అదే అతన్ని మామూలు మనిషిని చేయడానికి దోహదం చేసిందని భావిస్తుంటారు. కోలుకోగానే పనిలో బిజీ అయ్యారు. చెన్నై లో ట్యాలెంట్ మ్యాక్సిమస్ అనే సాఫ్ట్ వేర్ యాప్ డెవలప్ కంపెనీని అరవింద్ స్వామి స్థాపించి డెవలప్ చేశారు. ఈ కంపెనీకి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఈ కంపెనీకి క్లైంట్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర 5 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు

మళ్లీ మణిరత్నం వల్లే..సినిమాలకు దాదాపు పదేళ్లు దూరంగా ఉన్న అరవింద్ స్వామిని మణిరత్నమే మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చారు. కడలి అనే చిత్రంలో మంచి క్యారక్టర్ ఇచ్చారు. అందుకోసం అరవింద్ స్వామి ఒకటిన్నర నెలలో 18 – 20 కిలోల బరువు తగ్గారు.

విలన్ గా ఎంట్రీగత ఏడాది తని వరువన్ చిత్రం ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇది సూపర్ హిట్ అయింది. ఇందులో నటనను మెచ్చి తెలుగు వెర్షన్ ధృవ లోను తీసుకున్నారు. ఇక్కడ కూడా అదరగొట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చారు.

టీవీ షోకౌన్ బనేగా కరోడ్ పతి మాదిరిగా తమిళంలో రూపొందిన “నీంగళుమ్ వెళ్లాలం ఒరు కోడి” అనే రియాలిటీ షో కి హోస్ట్ గా ఛాన్స్ అందుకున్నారు. స్టార్ విజయ్ ఛానల్ ల్లో ప్రసారమయ్యే ఈ షో కు ఇదివరకు సూర్య, ప్రకాష్ రాజ్ హోస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ త్వరలో ప్రసారం కానుంది.

త్వరలో డైరక్టర్ గా ..హీరో, విలన్ గా నిరూపించుకున్న అరవింద్ స్వామి డైరక్టర్ గా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది దర్శకత్వం చేయ డానికి రెండు కథల్ని సిద్ధం చేసుకొన్నారు. ఇటీవల ‘వనంగముడి’ అనే కథ పూర్తి చేశారు. ఒక పోలీసు పాతికేళ్ల జీవితం నేపథ్యంలో సాగే ఆ కథ అది. అందులో హీరోగా నటిస్తూ డైరక్షన్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus