వాలెంటైన్స్ డే సందర్భంగా నిఖిల్ అర్జున్ సురవరం పోస్టర్ విడుదల..
- February 14, 2019 / 06:29 PM ISTByFilmy Focus
యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర కొత్త పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ మధ్యే విడుదలైన టైటిల్ పోస్టర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
- దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
- ‘మజిలీ’ టీజర్ రివ్యూ

త్వరలోనే ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ఈ చిత్రంలో సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మధు అర్జున్ సురవరం చిత్రాన్ని సమర్పిస్తున్నారు.











