వాలెంటైన్స్ డే సందర్భంగా నిఖిల్ అర్జున్ సురవరం పోస్టర్ విడుదల..

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. ఈ మ‌ధ్యే విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

త్వ‌ర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు అర్జున్ సురవరం చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus