Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?
- August 31, 2026 / 04:51 PM ISTByFilmy Focus Desk
ఓవైపు సినిమా ఉంటుందా? లేదా? అనే రూమర్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.. మరోవైపు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అదే వేగంగా జరుగుతున్నాయి. అదే బాలకృష్ణ – కొరటాల శివ సినిమా. కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఉండదు అంటూ ఆ మధ్య ఓ రూమర్ తెగ చక్కర్లు కొట్టింది. దానికి కారణం ఆ సినిమాకు సంబంధించిన వార్త ఒక్కటీ బయటకు రాకపోవడమే. అందుకేనేమో సినిమా బ్యాగ్రౌండ్ పనులు జరుగుతున్న విషయం ఒకటి బయటకు వచ్చింది.
Arya
ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘దేవర 2’ సినిమాను పక్కన పెట్టిన తర్వాత కొన్ని రోజులు ఇతర హీరోలతో సినిమాల కోసం ట్రై చేసిన కొరటాల శివ.. ఫైనల్లీ బాలకృష్ణతో సినిమాను ఓకే చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఓకే అయినప్పటి నుండి ఆయన ప్రీప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నారట. ఈ క్రమంలో సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమిళ నటుడు ఆర్యను ఎంపిక చేశారు అని తెలుస్తోంది.

తెలుగులో ఇప్పటికే మూడు స్ట్రయిట్ సినిమాలు తీసిన ఆర్యకు ఇది నాలుగో తెలుగు సినిమా అవుతుంది. ఇప్పటివరకు ఆయన ‘వరుడు’, ‘సైజ్ జీరో’, ‘సైంధవ్’ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆ మూడు ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వకపోవడం గమనార్హం. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాలో ఆర్య.. ఓ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడట. అయితే అది విలనా? కాదా అనేది తెలియదు.
ఇక ఈ సినిమాకు ‘కార్పెంటర్’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంటే సినిమాలో బాలకృష్ణ సమాజాన్ని చక్కదిద్దే వడ్రంగిగా కనిపిస్తాడని సమాచారం. అదేంటి అనుకుంటున్నారా? మాస్, కమర్షియల్ కథకు సామాజిక అంశాల టచ్ ఇవ్వడం కొరటాల స్టైల్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని టాక్. వినాయక చవితికి ఓ స్పెషల్ వీడియోతో సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని టాక్.














