విశ్వక్ సేన్ ను ప్లాప్ నుండీ బయటపడేసేలా ఉందే..!

  • April 20, 2022 / 05:29 PM IST

‘పాగల్’ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన మూవీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ‘ఎస్.వి.సి.సి డిజిటల్’ బ్యానర్‌ పై, బీవీయస్ఎన్ ప్రసాద్ సమర్పణలో, బాపినీడు నిర్మిస్తున్న ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ ‘ఎబిసిడి’ ఫేమ్ రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ఇది. 30 ఏళ్ళ వయసు వచ్చినా పెళ్ళికాని యువకుడు అల్లం అర్జున్‌కుమార్ గా ఈ మూవీలో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు.

Click Here To Watch NOW

పెళ్లి కోసం ఓ యువకుడు పడే అవస్థలను ఈ మూవీలో ఫన్నీగా చూపించినట్టు టీజర్ ద్వారా స్పష్టం చేసారు. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ట్రైలర్లో అదే విషయాన్ని ఇంకాస్త డెప్త్ గా చూపించే ప్రయత్నం చేశారు. అమాయకుడైన హీరోకి తన కులంలోని పిల్లనే ఇచ్చి పెళ్లి చేయాలనేది ఇంట్లో వాళ్ళ పట్టింపు. అందుకోసం రాష్ట్రం దాటి తెలంగాణ అమ్మాయిని వెతికి పట్టుకుంటారు. పెళ్ళి చూపులయ్యయి, పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది.

కానీ ఇక్కడేదో సమస్య. హీరోయిన్ కు పెళ్లి నచ్చలేదు అని చెప్పడం.. ఆ తర్వాత హీరో ఎదుర్కొన్న ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ను చూపించారు. ఇంత సీరియస్ కంటెంట్ లో కూడా నవ్వులు పూయించే కామెడీ చాలానే ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇక ట్రైలర్లో విశ్వక్ సేన్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. మాస్ క దాస్ ను కాస్త… క్లాస్ క దాస్ గా, ప్రజెంట్ చేయబోతున్నట్టు ట్రైలర్లో చెప్పకనే చెప్పారు.

అలాగే విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది.మే 6న ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus