పవన్ కళ్యాణ్ దేవుడితో సమానమంటున్న అషురెడ్డి!

టిక్ టాక్ వీడియోల ద్వారా, తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం ద్వారా అషురెడ్డి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన అషురెడ్డి కొన్ని రోజుల క్రితం తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పవన్ ఇచ్చిన లేఖను పోస్ట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ లవ్ అని పేర్కొన్నారు. ఆ తరువాత ఒక నెటిజన్ కామెంట్ కు అషురెడ్డి యస్ అని సమాధానం ఇవ్వడంతో అషురెడ్డి గురించి అభ్యంతరకర వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

సోషల్, వెబ్ మీడియాలో తన గురించి వైరల్ అవుతున్న వార్తలపై అషురెడ్డి తాజాగా స్పందించడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ కళ్యాణ్ కు అభిమానినని ఎప్పటికీ అభిమానిగానే ఉంటానని అషురెడ్డి అన్నారు. తన పేరు చెడగొట్టేలా తప్పుడు వార్తలు రాయవద్దని.. పవన్ కళ్యాణ్ తనకు దేవుడితో సమానం అని ఆమె అన్నారు. తన అభిమానాన్ని వేరే విధంగా ఆపాదిస్తూ పిచ్చిరాతలు రాస్తున్నారని అషురెడ్డి పేర్కొన్నారు.

ఇతరుల పేరును బదనాం చేస్తూ రాసే రాతల వల్ల చాలామంది మనోభావాలు తింటాయని.. పవన్ కళ్యాణ్ అభిమానులను కలవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ వార్తలపై స్పందించాలని అనుకోలేదని కానీ ఓపిక నశించడంతో స్పందించాల్సి వస్తోందని అషురెడ్డి తెలిపారు. అభిమాని అంటే చచ్చేవరకు అభిమానిలానే ఉంటారని.. మీ రాతల వల్ల నా పేరును నాశనం చేయవద్దని అషురెడ్డి కోరారు.

మూడు రోజుల క్రితం అషురెడ్డి చేసిన పోస్ట్ కు సంబంధించిన కామెంట్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆ ట్రోల్స్ పవన్ కళ్యాణ్ పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉండటంతో అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించి ఆ ట్రోల్స్ కు సంబంధించి వివరణ ఇవ్వడంతో పాటు ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిని హెచ్చరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus