Ashu Reddy Mother: అషూని చెడా మడా తిడుతూ ఎంట్రీ ఇచ్చిన అషూ తల్లి..! కారణం ఇదేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ ని తీస్కుని వచ్చే ఎపిసోడ్ ఈసారి చాలా తొందరగా పెట్టేశాడు బిగ్బాస్. నిజానికి టాప్ 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేసేవారు. అయితే, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ వాళ్ల పాప, శివ సిస్టర్, అషూమదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రోమోని రిలీజ్ చేశాడు బిగ్ బాస్. దీంతో హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆడియన్స్ చూడబోతున్నారు. ఇందులో భాగంగా అషూరెడ్డి మదర్ హౌస్ లో చీపురుతో ఎంట్రీ ఇవ్వడం అనేది హైలెట్ అని చెప్పాలి.

చీపురు పట్టుకుని మరీ వస్తున్న మదర్ ని చూస్తూ , పరువు పోతుందే.. కొట్టకే అంటూ అషూ అల్లరి చేస్తోంది. మమ్మీ ఇప్పుడు అందరి ముందు కొట్టకు అంటూ వెళ్లి తల్లిని హక్ చేసుకోవడంతో చీపురు కింద పడేసి ఎమోషనల్ అయ్యింది అషూ తల్లి. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో నటరాజ్ మాస్టర్ పాప రెడ్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. మాస్టర్ పాపతో ఆడుకోవడం, అల్లరి చేయడం ఇవన్నీ కూడా ఎమోషన్స్ ని పీక్స్ కి తీస్కుని వెళ్లాయి. తర్వాత అషూ వాళ్ల మదర్ తన ఫేవరెట్ గా అఖిల్ పేరు చెప్పింది. దీంతో అందరూ కాసేపు సరదాగా ఆమెతో మాట్లాడారు.

ఇక ఈ ప్రోమో చూసిన వాళ్లందరూ కూడా నటరాజ్ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నారని, అందుకే ఈ ప్రోమో కోసమే , ఎమోషనల్ కోసమే ఫ్యామిలీ ఎపిసోడ్ పెట్టారని అంటున్నారు. కానీ, నటరాజ్ మాస్టర్ భార్య నీతు, పాప ఇద్దరూ హౌస్ లోకి వచ్చినపుడు మాస్టర్ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఈ ఎపిసోడ్ ని సీజన్ కే హైలెట్ చేయాలని మాస్టర్ ప్లాన్ బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడని కామెంట్స్ చేస్తున్నారు అందరూ. ఇక తన గారాలపట్టీతో మాస్టర్ గార్డెన్ లో చాలాసేపు ఆడుకున్నారు. హౌస్ మేట్స్ అందరూ కూడా భావోద్వేగాలకి గురి అయ్యారు. అలాగే, యాంకర్ శివ సిస్టర్ యమున హౌస్ లకి వచ్చింది. సందడి చేసింది.

వీళ్లతో పాటుగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ లో కొందరు హౌస్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. షణ్ముక్ జస్వంత్, నోయల్, జెస్సీ, టివి 9 దేవి, సోహైల్ రాబోతున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. షణ్ముక్, సోహైల్ , జెస్సీ వస్తే ఆ ఎపిసోడ్ పీక్స్ లో ఉంటుందని బిగ్ బాస్ లవర్స్ ఆశిస్తున్నారు. అదీ మేటర్.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus