‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్…!

కరోనా టైంలో ఓటిటిల హవా పెరిగింది. అయితే ఇదే సమయంలో ‘అమెజాన్ ప్రైమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజానికి అంతకు ముందు నుండీ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్స్ బాగానే ఉండేవారు కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడడంతో ఈ యాప్ వాడకం మరింతగా పెరిగింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసేది ‘అమెజాన్ ప్రైమ్’ సంస్థ అని అందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ లాక్ డౌన్ టైంలో కొన్ని సినిమాలను భారీ రేట్లకి కొనుగోలు చేసుకుని నేరుగా డిజిటల్ రిలీజ్ చేసింది ఈ సంస్థ. దాంతో ప్రైమ్ వీడియోకి మరింత డిమాండ్ పెరిగింది. ఎంత పెద్ద సినిమా అయినా సరే 4,5 వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ సంస్థ భారీ రేట్లు పెట్టి పెద్ద సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. సెకండ్ వేవ్ టైములో కూడా ‘అమెజాన్ ప్రైమ్’ హవా కొనసాగింది. ఈ టైములో కూడా కొన్ని పెద్ద సినిమాలను అలాగే చిన్న సినిమాలను మిడ్ రేంజ్ సినిమాలను నేరుగా డిజిటల్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ వ్యూయర్ షిప్ ను నమోదు చేసిన సినిమాలేంటో. అలాగే టాప్ 10 లిస్ట్ లో ఉన్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) రాధే శ్యామ్ :

ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీ ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సినిమాలను పక్కకు నెట్టి టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ మూవీ థియేటర్లలో మాత్రం పెద్ద ప్లాప్ అయ్యింది.

2) పుష్ప ది రైజ్ :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ‘రాధే శ్యామ్’ విడుదల కాకముందు వరకు టాప్ ప్లేస్ లో ఉండేది. కానీ ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది.

3) దృశ్యం 2 :

వెంకటేష్- మీనా కాంబినేషన్లో ‘దృశ్యం’ కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ మంచి వ్యూయర్ షిప్ ను నమోదు చేసి టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. ఈ మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది.

4) జైభీమ్ :

సూర్య హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ పరంగా కూడా టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ మూవీ కూడా నేరుగా ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యింది.

5) టక్ జగదీష్ :

నాని హీరోగా నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక వ్యూవర్ షిప్ ను నమోదు చేసి టాప్ 5 ప్లేస్ ను దక్కించుకుంది.

6) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ అత్యధిక వ్యూయర్ షిప్ ను నమోదు చేసి ఇప్పటికీ టాప్ 5 లో కొనసాగుతుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 3 వారాలకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. అయినా ఈ రేంజ్లో రాణించడం అంటే మాములు విషయం కాదు.

7) నారప్ప :

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘అసురన్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కూడా మంచి వ్యూయర్ షిప్ ను నమోదు చేసి టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన మూవీ.

8) ఆకాశం నీ హద్దురా :

సూర్య హీరోగా నటించిన ఈ మూవీ కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన మూవీ. ఇప్పటికీ ఈ మూవీ టాప్ ప్లేస్ కొనసాగుతుండడం విశేషం.

9) జాతి రత్నాలు :

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ కూడా మంచి వ్యూయర్ షిప్ ను నమోదు చేసి ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది.

10) నిశ్శబ్దం :

అనుష్క నటించిన ఈ మూవీ అత్యధిక వ్యూయర్ షిప్ నమోదు చేసిన మూవీగా ఇప్పటికీ టాప్ 10లో కొనసాగుతుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus