టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అశు రెడ్డి తాజాగా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నిర్మాత కె.పి చౌదరి వద్ద ఈమె డ్రగ్స్ విక్రయించారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి.అధికారుల కస్టడీలో ఉన్నటువంటి నిర్మాత కేపి చౌదరి 12 మంది పేర్లలో బయటపెట్టారని అలాగే ఆయన ఫోన్ కాల్స్ చూస్తే కనుక అశు రెడ్డి తో కూడా ఎక్కువగా మాట్లాడారని అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఇదివరకే స్పందించిన ఈమె తాజాగా మరోసారి ఈ వార్తలపై రియాక్ట్ అయ్యారు. అయితే తన ఫోన్ కాల్స్ బహిర్గతం చేయటం వల్ల తనకు ప్రతి ఒక్క సెకండ్ కి ఫోన్ వస్తుందని దానివల్ల తాను ఎంతో ఇబ్బంది పడుతున్నానని ఈమె ఒక వీడియో ద్వారా తెలియజేశారు. అలాగే తన గురించి కొన్ని మీడియా ఛానల్స్ అసత్యపు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
ఇలా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా (Ashu Reddy) తన గురించి ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడంతో తాను కొన్ని మీడియా ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని ఈమె హెచ్చరించారు. తాను వందల కొద్ది ఆ వ్యక్తితో మాట్లాడానని వార్తలు వస్తున్నాయి. అయితే నా వద్ద ఫోన్ కాల్ లిస్ట్ ఉందని నిజా నిజాలు ఏంటో నేను కూడా నిరూపిస్తానని ఈమె తెలియజేశారు.
ఇక ఈ ఘటన జరిగినప్పుడు తాను వేరే కంట్రీలో ఉన్నానని ,ఈ కేసుతో తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారిలో ఈమెతో పాటు నటి సురేఖ వాణి అలాగే జ్యోతి వంటి సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ కేసు గురించి ఇదివరకే వీరిద్దరు కూడా స్పందిస్తూ మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.