Varun Tej ,Lavanya: ఈ ఏడాది వేణు స్వామి చెప్పిన ఆ రెండు విషయాలు నిజమయ్యాయట..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితమే. బాబు గోగినేని అనే నాస్తికుడు కమ్ బిగ్ బాస్ సెలబ్రిటీ ఇతన్ని ఫ్రాడ్ అన్నాడు, కానీ బాబు గోగినేని విషయంలో వేణు స్వామి చెప్పింది నిజమయ్యింది. అది యాదృచ్చికం కావచ్చు. కానీ వేణు స్వామిని ఆ సంఘటన బాగా పాపులర్ అయ్యేలా చేసింది.ఇక సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు, రాంచరణ్ – ఉపాసన లు లేట్ గా తల్లిదండ్రులు అవుతారు అని ఇతను గతంలో చెప్పాడు.

అవి నిజమయ్యాయి. కాబట్టి ఇతను చెప్పాడు అంటే ఇది అక్షర సత్యం అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. మొన్నటికి మొన్న 2023 లో ప్రభాస్ జాతకం చాలా వరస్ట్ గా ఉందని ఇతను చెబితే.. అది ప్రభాస్ అభిమానులను బాగా హర్ట్ చేసింది. ఇక ఈ ఏడాది.. అంటే, 2023 లో వేణు స్వామి చెప్పిన మరో రెండు విషయాలు కూడా నిజమయ్యాయట. అవేంటి అంటే.. 2023 లో ఓ యంగ్ హీరో చనిపోతాడు అని ఇతను చెప్పాడట.

తారకరత్న మరణంతో అది నిజమైనట్టు అయ్యింది. అలాగే ఓ టాలీవుడ్ హీరో, టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు అని అతను చెప్పాడట. ఈరోజు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం వేడుక గురించి వచ్చిన వార్తతో అది కూడా నిజమైనట్టు అంతా చెప్పుకుంటున్నారు. మరికొంతమంది అయితే ఇది వట్టి అపోహ అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. మిగిలిన విషయాల్లో వేణు స్వామి చెప్పింది లేట్ అయినప్పటికీ..

(Varun Tej) వరుణ్ – లావణ్య త్రిపాఠి విషయంలో అతను చెప్పింది త్వరగా నిజమవ్వడం గమనార్హం. అలాగే ఓ యంగ్ హీరో అని వేణు స్వామి అన్నాడు కానీ తారకరత్న అని పేరు చెప్పలేదు. మరోపక్క ఓ టాలీవుడ్ హీరో, హీరోయిన్ అన్నాడు కానీ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుంటారు అని కచ్చితంగా చెప్పింది లేదు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus