Srikanth Iyengar: వైరల్ అవుతున్న నటుడు శ్రీకాంత్ అయ్యర్ వీడియో!

ఈ మధ్య కాలం లో సినిమాల్లో బాగా బిజీ అయినా క్యారక్టర్ ఆర్టిస్టులలో ఒకరు శ్రీకాంత్ అయ్యంగార్. ప్రతీ శుక్రవారం విడుదల అయ్యే సినిమాలలో ఇతను కచ్చితంగా ఉండాల్సిందే, ఆ రేంజ్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఈమధ్యనే ఈయన తన పేరు ని శ్రీకాంత్ అయ్యంగార్ నుండి శ్రీకాంత్ భారత్ గా మార్చుకున్నాడు. ఇకపోతే రీసెంట్ గా ఈయన సోషల్ మీడియా లో వరుసగా కాంట్రవెర్షియల్ ట్వీట్స్ వేస్తూ వస్తున్నాడు. వాటికి రీచ్ మామూలు రేంజ్ లో లేదు.

పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కి సపోర్టుగా, వైసీపీ పార్టీ పై వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తూ ఉన్నాడు. గత కొంతకాలంగా ఈయన ఒక సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటున్నాడు. పాపం ఈయనకి ప్రతి రోజు రాత్రి మందు త్రాగే అలవాటు ఉంది అనుకుంట. బ్రాండెడ్ ఇంపోర్టెడ్ మందు ని త్రాగే శ్రీకాంత్, ఆంధ్ర ప్రదేశ్ దొరికే మద్యం ని చూసి ఆయనకీ మైండ్ బ్లాక్ అయ్యింది. ముందుగా ‘బూమ్ బూమ్’ బీర్ తాగుతున్నాను, నా ప్రాణాలకు గ్యారంటీ లేదు, రేపు ఉంటానో ఉండనో అంటూ వ్యంగ్యంగా ఒకసారి ట్వీట్ వేసాడు.

దీనిపై వైసీపీ పార్టీ అభిమానులు చాలా తీవ్రంగా విరుచుకుపడగా, శ్రీకాంత్ భారత్ కి సపోర్టుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిలిచారు. అప్పటి నుండి శ్రీకాంత్ వారానికి ఒక్కసారి అయినా వైసీపీ పార్టీ పై సెటైర్లు వేస్తూ ఉండేవాడు. దీంతో వైసీపీ పార్టీ అభిమానులు నా పైకి వచ్చి దాడి చేసారు, ఆమ్మో నన్ను కాపాడండి అంటూ (Srikanth Iyengar) శ్రీకాంత్ నిన్న ట్విట్టర్ లో ఒక వీడియో వేసాడు.

ఇది నిజంగానే జరిగిందేమో అని అందరూ అనుకుంటున్న సమయం లో ట్విస్ట్ ఇస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, స్పెషల్ స్టేటస్ సాదిస్తాను అని అంటాడు. ‘స్పెషల్ స్టేటస్’ అనే అది కూడా మద్యం బ్రాండ్స్ లో ఒకటి అనేది మన అందరికీ తెలిసిందే. ఇలా మరోసారి శ్రీకాంత్ వైసీపీ పార్టీ ని ర్యాగింగ్ చెయ్యడం తో చర్చల్లో నిలిచాడు. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus