Anupama: అనుపమలో ఒక్క క్వాలిటీ వల్లే ఇన్నాళ్లు హీరోయిన్ గా ఉందా..!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు విభిన్నమైన పాత్రలు పోషిస్తుంటారు. వారిలో కొందరు తమ కన్న వయసులో చిన్న వాళ్లతో నటిస్తుంటే.. మరి కొందరు ఏజ్ బారు హీరోలతో సైతం రొమాన్స్ కు రెడీ అంటుంటారు. కొంతమందైతే కేవలం గ్లామర్ షోలకే పరిమితం అవుతుంటారు. లిప్ లాక్ లు, ఇంటి మేట్ సీన్లు ఉన్నా డబ్బులిస్తే దేనికైనా రెడీ అంటారు. అయితే అనుపమ పరమేశ్వరన్ మాత్రం మిగతా హీరోయిన్ల లాగా కాదు తను చాలా డిఫరెంట్.

ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ప్రేక్షకుల మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్ గా నిలుస్తోంది. ఆమె మాతృభాష తెలుగు కాదు, మలయాళీ. అయినా తన అందం, ప్రతిభతో తెలుగువారి మనసు దోచుకుంది. హీరోలకి మించిన స్థాయిలో నటనను కనబరుస్తూ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుదనం ఉట్టిపడే సహజ సౌందర్యం అనుపమది.చీర, చుడిదార్, పూలు, గాజులు ధరించి సంప్రదాయ తెలుగు అమ్మాయిలా మారగలదు.

ఎలాంటి వేషధారణలోనైనా ఆమె అద్భుతంగా కనిపిస్తుంది. అయితే మేకప్ అందం, గ్లామర్‌పై ఆధారపడే ఈ తరం హీరోయిన్ల ట్రెండ్స్‌ని ఆమె అసలు అనుసరించదు. తనకు అందం ఎలాంటిదో.. దానికి తగ్గ ఎలాంటి పాత్రలు చేయాలో ఆమెకు తెలుసు. సిగ్గు విడిచి మరీ ఆమె పక్కవాళ్లు ఆరబోసినట్లు అందాలు ఆరబోయదు. స్టైల్, గ్రేస్ ఉన్న పాత్రలు చేయడానికి ఆమె అంగీకరిస్తుంది.

అఆ, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు, కార్తికేయ 2, 18 పేజీలు, అన్నింటిలో తాను కీలక పాత్రలను పోషించింది. వాటిలో రొమాన్స్ హద్దులు దాటలేదు. నిజానికి దర్శకులు చెప్పే మాటలను ఆమె గుడ్డిగా అనుసరించదు. తనను తాను ఎక్స్‌పోజ్ చేయడానికి, సినిమా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆమె ఎప్పుడూ వెనుకాడదు. ఆ ఒక్క క్వాలిటీ వల్లే (Anupama) అనుపమ ఇంకా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ముందుకు తీసుకెళ్తుంది అంటున్నారు అభిమానులు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus