సోగ్గాడుగా రానున్న అవసరాల

  • October 8, 2016 / 07:35 AM IST

నటుడిగా పలు సినిమాలు చేసినా రెండంటే రెండు సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. నటుడిగా ఇన్ని పాత్రలు చేసినా తనకు ‘అష్టాచమ్మా’  తప్ప తృప్తినిచ్చిన పాత్రలేవీ లేవని శ్రీని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. శ్రీని గురించి తెలిసిన నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ వంటివాళ్ళు కూడా అవసరాలలోని అసలు సిసలు నటుడిని ఎవరూ చూడలేదన్నారు.

అయితే ప్రస్తుతం అతడు చేస్తున్న ఓ సినిమా శ్రీనిని కొత్తగా చూపించనుంది. ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన శ్రీని హిందీ చిత్రం ‘హంటర్’ రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సెక్స్ అడిక్ట్ పాత్రలో శ్రీని ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి ‘సోగ్గాడు’  టైటిల్ ని ఖరారు చేశారట. ‘బాబు బాగా బిజీ’ అన్నది ఉపశీర్షిక. ఈ టైటిల్ తో శోభన్ బాబు, తరుణ్ సినిమాలు రాగా ఈ సంక్రాంతికి నాగ్ కూడా సోగ్గాడు గా అలరించారు. ఇప్పుడు మళ్ళీ అదే అరిగిపోయిన టైటిల్ ని శ్రీని ఎందుకు పెట్టుకున్నాడో మరి..!

https://www.youtube.com/watch?v=IZ_ZV54npiw

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus