Avatar2 Tickets: అవతార్2 మూవీ టికెట్ రేట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ad not loaded.

ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలలో అవతార్2 సినిమా కూడా ఒకటి. డిసెంబర్ 16వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవగా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా రికార్డులు సాధిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అవతార్2 మూవీ బుకింగ్స్ ఓపెన్ కాగా ఈ మూవీ టికెట్ రేట్లు వింటే అవాక్కవ్వాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బెంగళూరులోని ప్రముఖ ఐమ్యాక్స్ లో ఈ మూవీ టికెట్ ధర ఏకంగా 1440 రూపాయలుగా ఉంది. సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉన్నా ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. ఇతర ఛార్జీలతో కలిపి టికెట్ ధర 1512 రూపాయలుగా ఉండటంతో అందరూ షాకవుతున్నారు. అయితే టికెట్ రేట్లు భారీగా ఉన్నా ఈ సినిమాకు బుకింగ్స్ కూడా ఊహించని రేంజ్ లో ఉన్నాయి. బెంగళూరులోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో 940 రూపాయల కంటే ఎక్కువ మొత్తం టికెట్ రేట్ ఉండటంతో షాకవ్వడం ఈ సినిమా అభిమానుల వంతవుతోంది.

సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు అవతార్2 మూవీని థియేటర్లలో చూడటం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో అవతార్2 మూవీ టికెట్ ధర 350 రూపాయలుగా ఉండగా విశాఖలో 210 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం శుభవార్త అని చెప్పవచ్చు.

విజువల్ ఎఫెక్ట్స్ లో అవతార్2 సినిమాను చూడాలని భావించే ప్రేక్షకుల జేబుకు చిల్లులు పడటం గ్యారంటీ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకులకు భారీ షాకులు ఇస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus