రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయిన ‘అవును… నిజమే’

జబర్దస్త్‌ ఫేం ‘సుడిగాలి’ సుధీర్‌ హీరోగా శ్రావణి, మనీషా హీరోయిన్స్‌గా సత్యశ్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి వరసాల సరస్వతి నరసింహారావు సమర్పణలో గూన అప్పారావు దర్శకుడుగా సత్యనారాయణ వరసాల నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘అవును.. నిజమే’. ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. చిత్ర విశేషాలను నిర్మాత సత్యనారాయణ వరసాల తెలియజేస్తూ – ”సుడిగాలి’ సుధీర్‌, శ్రావణి, మనీషా జంటగా నటిస్తున్న ‘అవును.. నిజమే’ చిత్రాన్ని యూత్‌కి నచ్చేవిధంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌, అరకు, అమలాపురం, కాకినాడ, కడియపులంక, యానాం, పాండిచ్చేరి వంటి అందమైన ప్రదేశాల్లో చిత్ర షూటింగ్‌ జరిపాం. రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్‌ పూర్తి చేయడం జరిగింది. రెండు పాటలు బాలెన్స్‌ ఉన్నాయి. ఈ నెలలో పాటల్ని చిత్రీకరిస్తాం. నెలాఖరులో ఆడియో రిలీజ్‌చేసి మే మూడో వారంలో సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

దర్శకుడు గూన అప్పారావు మాట్లాడుతూ – ”యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. రమణ కానూరి సంగీతం, రవికుమార్‌ ఫొటోగ్రఫి సినిమాకి మంచి ప్లస్‌ అయింది. సుడిగాలి సుధీర్‌కి హీరోగా ఈ సినిమా మంచి బ్రేక్‌ వస్తుంది” అన్నారు.

సుమన్‌శెట్టి, జూ. రేలంగి, పొట్టి చిట్టిబాబు, ఆకెళ్ల గోపాలకృష్ణ, జబర్దస్త్‌ అప్పారావు, ‘గుండు’ సుదర్శన్‌, ఎఫ్‌ఎం బాబాయ్‌, బెన్నీ, అనూష, శ్రీదేవి, కావేరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమణ కానూరి, ఫొటోగ్రఫి: రవికుమార్‌ బైపల్లి, కొరియోగ్రఫి: బండ రామారావు, ఎడిటర్‌: పోచ సోమేశ్వరరావు, సాహిత్యం: పవన్‌ శంకర్‌, సమర్పణ: వరసాల సరస్వతీ నరసింహారావు, నిర్మాత: సత్యనారాయణ వరసాల, దర్శకత్వం: గూన అప్పారావు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus