బీకామ్ లో ఫిజిక్స్ పాఠాలు చెప్పనున్న స్పైడర్ ?

రాజకీయ నాయకుడు జలీల్ ఖాన్ ఏ ముహూర్తాన బీకామ్ లో ఫిజిక్స్ అని చెప్పాడో గానీ.. ఆ పదం బాగా పాపులర్ అయింది. కామెడీకి ప్రతి ఒక్కరూ ఈ డైలాగ్ ని ఉపయోగిస్తున్నారు. బుల్లితెర కామెడీషోలలో తెగ వినిపిస్తున్న ఈ పదం ఇప్పుడు వెండితెరపై వినిపించనుంది. అది సూపర్ స్టార్ మహేష్ మూవీలో కావడం విశేషం. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ స్పైడర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా వద్ద గల పోలీస్ క్వార్ట్రెస్ లో జరుగుతోంది. క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. అనంతరం చిత్రం బృందం రెండు పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనుంది.

ఆ పాటలకు హరీష్ జయ్ రాజ్ స్వరాలకు సమకూర్చే పనిలో బిజీగా ఉండగా, అందుకు సాహిత్యాన్ని అందించడంలో రామజోగయ్య శాస్త్రి నిమగ్నమై ఉన్నారు. ఒక పాటలో  ” బీకామ్ లో ఫిజిక్స్ ఉండొచ్చు ఏమో.. నీ సోకులా కొలతల్లో తేడా ఉండదు” అనే లిరిక్స్ రాసినట్లు తెలిసింది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అయింది. దీనిపై రామ జోగయ్య శాస్త్రి స్పందించారు. ఆ వార్త కరక్ట్ కాదని చెప్పారు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 9 న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus