తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కంక్లూజన్ 11 డేస్ కలక్షన్స్
- May 9, 2017 / 12:19 PM ISTByFilmy Focus
ఎస్.ఎస్.రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. పది రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో ఈ మార్క్ దాటిన తొలి మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. సోమవారం కూడా భారీ మొత్తాన్ని వసూలు చేయడంతో అంకెలు పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబలికి బ్రహ్మరధం పడుతున్నారు. పదకొండవ రోజు (సోమవారం) చివరి షోకి వచ్చిన మొత్తంతో కలుపుకుంటే 146 కోట్ల షేర్ వసూల్ చేసింది. 150 కోట్లకు చేరువవుతోంది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు…
ఏరియా కలెక్షన్లు
నైజాం : 47.94 కోట్లు
సీడెడ్ : 25.45 కోట్లు
ఉత్తరాంధ్ర : 19.09 కోట్లు
ఈస్ట్ : 13.72 కోట్లు
వెస్ట్ : 10.16 కోట్లు
క్రిష్ణా : 10.33 కోట్లు
గుంటూరు : 13.91కోట్లు
నెల్లూరు : 5.44 కోట్లు
మొత్తం 146.04 కోట్లు
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















