బాహుబలి 2 కి మరోసారి లీకుల తలనొప్పి
- April 25, 2017 / 12:07 PM ISTByFilmy Focus
స్టార్ హీరోల సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ నిర్మాతలకు వరమైతే.. కొన్నిసార్లు అదే శాపం కూడా అవుతుంది. ఈ క్రేజ్ వల్ల మొన్న ‘అత్తారింటికి దారేది’ సినిమా .. నిన్న బాహుబలి 2 కంక్లూజన్ సీన్లు బయటికి వచ్చాయి. సినిమా నెట్లో అందుబాటులోకి వస్తే నిర్మాత పరిస్థితి దారుణమే. అందుకే బాహుబలి చిత్ర బృందం ఈ లీకులను అరికట్టడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా జక్కన్న టీమ్ కి లీకుల వీరులు చమటలు పుట్టిస్తున్నారు. రిలీజ్ కి ముందే సినిమాని మీకు అందిస్తామంటూ హల చల్ చేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి దున్నపోతులతో పోరాడుతున్న ఫోటో, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ లో రానాని మంటల్లో తగలబెట్టడం ఫోటోలు షికారు చేస్తున్నాయి. అయితే దీనిని ఖండించే వారు లేకపోలేదు. ఇదంతా పబ్లిసిటీ లో భాగమని కొట్టిపడేస్తున్నారు. మరి నెట్లో విహారం చేస్తున్న ఫోటోల గురుంచి రాజమౌళి టీమ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















