దాదాపు నెల రోజుల విరామం తరువాత బాహుబలి చిత్ర బృందం తిరిగి షూటింగ్ కు సిద్దమౌతోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో.. చిత్ర దర్శకుడు రాజమౌళి చిత్ర బృందానికి ఓ నెల రోజుల విశ్రాంతి ఇచ్చారు. బాహుబలి చిత్రంలోని రెండవ భాగం ‘బాహుబలి ది కంక్లూషన్’ చిత్రం తిరిగి జూన్ 1 నుంచి చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం.
ఈ చిత్రం నవంబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకొని, ఆ తరువాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకొని ఏప్రిల్ 2017 న విడుదల కానుంది. ఈ చిత్రంలో రానా, ప్రభాస్, తమన్నా, అనుష్కలు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆర్కా మీడియా పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి చిత్రంలోని మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.