దంగల్ రికార్డ్స్ ని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్న బాహుబలి బృందం

  • June 7, 2017 / 01:45 PM IST

బాహుబలి కంక్లూజన్ భారతీయ చిత్ర పరిశ్రమకు ముఖ చిత్రంగా మారింది. ఇదివరకు ఏ మూవీ సాధించని రీతిలో కలక్షన్స్ రాబట్టింది. చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కంక్లూజన్ 1600 కోట్లను వసూలు చేసింది. బాలీవుడ్ మూవీ దంగల్తో చైనాలోని కలక్షన్స్ తో కలుపుకొని బాహుబలి 2 రికార్డ్స్ ని బీట్ చేయగలిగింది.  దీంతో దంగల్ రికార్డ్ ని చెరిపివేసేందుకు బాహుబలి రెడీ అవుతోంది. రాజమౌళి చెక్కిన వెండితెర శిల్పాన్ని చైనాలోనూ రిలీజ్ చేయాలనీ నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. డబ్బింగ్, డిస్ట్రిబ్యూషన్ పనులతో పాటు ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభాస్, అనుష్కలను చైనాకి పంపిస్తున్నారు.

చిత్రంలో అలరించిన ఈ జంట అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ కానున్నారు. సినిమా సంగతులను చైనా సినీ ప్రియులకు వివరించనున్నారు. బాహుబలి బిగింగ్ కి ప్రచారం పెద్దగా చేయకపోవడంతో  చైనాలో ఆశించినంతగా ఆడలేదు. ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ప్రచారం ముమ్మరం చేయనున్నారు. చైనాలో సినిమా రిలీజ్ డేట్ ఖరారు కాగానే.. ప్రభాస్, అనుష్క చైనా ఫ్లయిట్ ఎక్కనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus