బాహుబలి రచయితతో కార్తీ చిత్రం..?

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కార్తీ నటించిననున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత కార్తీ మరో ముగ్గురు రచయితలు తయారు చేసిన కథల్లో నటించనుండగా, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ కూడా వారిలో ఉన్నారు.

విజయేంద్ర ప్రసాద్ కార్తీకి కథ చెప్పగా ఇందులో కార్తీ నటించడానికి అంగీకారం తెలిపాడని సమాచారం. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాదే దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరో రచయిత సుబ సిద్దం చేసిన కథకు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారట. ఈ రెండు చిత్రాలు కూడా ఒకేసారి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండగా.. కార్తీ ప్రస్తుతం కాష్మోరా చిత్రంలో నటిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus