సెన్సార్ పూర్తిచేసుకున్న బాహుబలి కంక్లూజన్ ట్రైలర్
- March 15, 2017 / 06:21 AM ISTByFilmy Focus
థియేటర్లలో మరి కొన్ని గంటల్లో బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి బిగినింగ్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా ట్రైలర్ ని రేపు రిలీజ్ కానుంది. ఇందుకోసం జక్కన్న ట్రైలర్ కి నిన్న సాయంత్రం సెన్సార్ పూర్తి చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న మూవీ కావడంతో హాలీవుడ్ తరహాలో 2 నిమిషాల 20 సెకన్ల ట్రైలర్ ను కట్ జేశారు. ఈ ట్రైలర్ ని చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు యుఎ సర్టిఫికేట్ జారీ చేశారు.

ఈ ట్రైలర్ ని చూసిన కొంతమంది చెప్పిన ప్రకారం.. ఎక్కువగా పోరాట సన్నివేశాలను పొందు పరిచారని, సినిమాలోని కీలక పాత్రలను పరిచయం చేస్తున్నారని తెలిపారు. నటీనటుల నటనతో పాటు గ్రాఫిక్స్, ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం మెస్మ రైజ్ చేస్తోందని వెల్లడించారు. గురువారం ఉదయం థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ కాగా, సాయంత్రం యూట్యూబ్ లో విడుదల కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















