బాహుబలి 2 ట్రైలర్ రివ్యూ
- March 16, 2017 / 06:21 AM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వీరోచితంగా నటించిన బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ నేడు రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అద్భుత సృష్టికి సినీ జనాలు జేజేలు పలుకుతున్నారు. ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా కనువిందు చేస్తోందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 2 .24 నిముషాల నిడివి గలిగిన ఈ వీడియో ” అమరేంద్ర బాహుబలి అను నేను .. అశేషమైన మహిష్మతి రాజ్య ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి సాక్షిగా ప్రాణం చేస్తున్నాను” అంటూ అమరేంద్ర బాహుబలి డైలాగ్ తో ప్రారంభమవుతుంది. అంతేకాదు సినిమాకే కీలకమైన బాహుబలిని కట్టప్ప చంపే సీన్ కూడా ఇందులో కొంచెం చూపించారు.
వెన్నుపోటు పొడిచిన తర్వాత ఇద్దరి మధ్య సంభాషణల్లో ” నువ్వు పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ” అని బాహుబలి చెప్పే డైలాగ్ అదరహో అనిపిస్తోంది. శివగామి నోటి నుంచి వచ్చే “అంతర్యుద్ధం” అనే మాట భయాన్ని పుట్టిస్తోంది. ఇక అనుష్క అందాలు, ఆమె కుంతల రాజ్యం, శివుడికి భల్లాలదేవుడి మధ్య యుద్ధం లోకి కొన్ని షాట్స్ సినిమాను చూడాలనే ఆత్రుతను మరింత పెంచింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















