Babu Mohan, Jr NTR: ఎన్టీఆర్ ఎంట్రీపై బాబు మోహన్ ఏమన్నారంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని ఈ మధ్య కాలంలో టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ తన పుట్టినరోజున జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మైనస్ అవుతారనేలా కామెంట్లు చేశారు. ప్రముఖ నటుడు బాబు మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా..? అనే ప్రశ్నకు బాబు మోహన్ ఇప్పట్లో ఆ అవకాశం లేదని తెలిపారు.

నా దేవుడు సీనియర్ ఎన్టీఆర్ పైన బాధ పడుతూ ఉంటాడని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే తెలంగాణలో టీడీపీ పార్టీకీ పూర్వవైభవం రావడానికి అవకాశం ఉండవచ్చని ఉండి తీరవచ్చని బాబు మోహన్ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ పై నుంచి ఎవరిని ఆశీర్వదించి పంపితే వాళ్లతోనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. బాబు మోహన్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నారని తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని 2024 ఎన్నికల ఫలితాలను బట్టి రాజకీయాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. టీడీపీ నుంచి పిలుపు వస్తే మాత్రమే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి స్పష్టత రావాలంటే కొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus