అల్లరి నరేష్ (Allari Naresh) ,అమృత అయ్యర్ (Amritha Aiyer) జంటగా నటించిన మూవీ ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది.రిలీజ్ కి ముందు నెలకొన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించేలా వచ్చాయి.
కానీ వీక్ డేస్లో ఈ సినిమా నిలబడలేకపోతుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 0.39 cr |
సీడెడ్ | 0.15 cr |
ఉత్తరాంధ్ర | 0.17 cr |
ఈస్ట్ | 0.07 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.10 cr |
కృష్ణా | 0.14 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.11 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.16 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.27 cr (షేర్) |
‘బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.1.27 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.73 కోట్ల షేర్ ను రాబట్టాలి.