2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ రూపొందిన సంగతి తెలిసిందే. ఇది సింబా తండ్రి ‘ముఫాసా’ కథ. ‘ముఫాసా’ వంటి పవర్ఫుల్ పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో దీనిపై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 20 న భారీ పోటీలో రిలీజ్ అయిన ‘ముఫాసా’ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి.
పెద్దగా ఈ సినిమాకి ప్రమోషన్ లేకపోయినా.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేదే పెద్ద పబ్లిసిటీ తెచ్చిపెట్టింది అని చెప్పాలి. దాని వల్ల వీక్ డేస్ లో కూడా ఈ సినిమా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.65 cr |
సీడెడ్ | 0.70 cr |
ఆంధ్ర(టోటల్) | 1.70 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 5.05 cr |
‘ముఫాసా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.5.05 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కేవలం తెలుగు వెర్షన్ తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా లాభాలు తెచ్చిపెట్టింది. మిగిలిన వెర్షన్లు కూడా కలుపుకుంటే రూ.5.70 కోట్ల వరకు షేర్ వచ్చిందని వినికిడి. మొత్తంగా ‘ముఫాసా’ ఇప్పటివరకు రూ.2.70 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.