Bachhala Malli: ‘బచ్చల మల్లి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

అల్లరి నరేష్ (Allari Naresh)  ,అమృత అయ్యర్ (Amritha Aiyer) నటించిన మూవీ ‘బచ్చల మల్లి'(Bachhala Malli). ‘సోలో బ్రతుకే సో బెటర్’  (Solo Brathuke So Better)  ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.దీంతో ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగినట్లు నిర్మాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Bachhala Malli:

ఇక థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :

నైజాం 220 cr
సీడెడ్ 0.50 cr
ఉత్తరాంధ్ర 0.65 cr
ఈస్ట్ +వెస్ట్ 0.50 cr
గుంటూరు +కృష్ణా 0.70 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ+తెలంగాణ(టోటల్) 4.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 cr
ఓవర్సీస్ 0.35 cr
టోటల్ వరల్డ్ వైడ్ 5.35 cr

‘ బచ్చల మల్లి’ సినిమాకి రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే క్రిస్మస్ సీజన్ కాబట్టి..మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి..!

అట్లీ – బన్నీ.. ఏం మాట్లాడుకున్నారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus