Sumanth: మొన్న సీతా రామం.. ఇప్పుడు సార్.. సుమంత్ కు కలిసొస్తుందిగా ..!

  • February 21, 2023 / 11:43 PM IST

సుమంత్ ..దివంగత స్టార్ హీరోలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా నాగార్జున మేనల్లుడిగా.. సినిమాల్లోకి అడుగుపెట్టాడు. 6 అడుగుల అందగాడు.. పైగా తాత ఏఎన్నార్ గారి పోలికలు కూడా ఇతనిలో నిండుగా ఉంటాయి. పలు హిట్టు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ స్టార్ గా ఎదగలేకపోయాడు. ఇక మధ్యలో ఇతను సినిమాలు కూడా తగ్గించాడు. ఇక ఫేడౌట్ అయిపోయాడు అనుకున్న టైమ్ లో మళ్ళీ రావా తో ఓ డీసెంట్ హిట్ అందుకుని ఫాంలోకి వచ్చాడు.

ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ వచ్చాడు. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఇతను ఏఎన్నార్ పాత్రలో చాలా చక్కగా నటించాడు. ఇతని లుక్ కూడా ఏఎన్నార్ కు చాలా సిమిలర్ గా ఉంది. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడంతో సుమంత్ ఈ పాత్రకు పడ్డ కష్టం వేస్ట్ అయిపోయింది.అయితే 2022 ఆగష్టులో వచ్చిన సీతా రామం చిత్రంలో బ్రిగేడర్.. విష్ణు శర్మ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇది పాజిటివ్ రోల్ కాదు అలా అని నెగిటివ్ రోల్ కూడా కాదు.

కానీ కథని మలుపు తిప్పే పాత్ర. చాలా ముఖ్యమైన పాత్ర. అలాగే లేటెస్ట్ గా వచ్చిన సార్ లో కూడా ఏ.ఎస్.మూర్తి పాత్రలో చాలా చక్కగా నటించాడు సుమంత్. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ లో సుమంత్ కనిపించకపోవడంతో .. సార్ సినిమా చూసినప్పుడు ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు.

ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వడంతో సుమంత్ కు మంచి పేరు వచ్చింది. ఇలాంటి కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలు సుమంత్ సెకండ్ ఇన్నింగ్స్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోగా స్టార్ అవ్వకపోయినా.. ఇలా విలక్షణ నటుడిగా స్టార్ అవుతాడేమో చూడాలి..!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus